బంగారు తాళి తెంపుకెళ్లారు | gold theft in jedimetla | Sakshi
Sakshi News home page

బంగారు తాళి తెంపుకెళ్లారు

May 13 2015 8:53 PM | Updated on Sep 3 2017 1:58 AM

పట్టపగలే స్నాచర్లు తెగబడ్డారు.. ఆరు బయట కూర్చున్న మహిళ మెడలోంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకుని పారిపోయారు

హైదారాబాద్: పట్టపగలే స్నాచర్లు తెగబడ్డారు.. ఆరు బయట కూర్చున్న మహిళ మెడలోంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకుని పారిపోయారు... ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. క్రైం ఎస్సై రామకృష్ణ వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్ డివిజన్ ఎల్‌బినగర్‌కు చెందిన రామకృష్ణ భార్య శ్రీలక్ష్మి(40) బుధవారం సాయంత్రం కరెంట్ లేకపోవడంతో ఉక్కపోత భరించలేక ఆరు బయటకూర్చుంది.

అదే సమయంలో నడుచుకుంటూ వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. షాక్‌లోంచి తెరుకున్న ఆమె వారి వెంట పరుగు తీసింది. అప్పటికే ద్విచక్ర వాహనంపై సిద్దంగా మరో వ్యక్తి ఉండగా ముగ్గురు కలిసి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement