కార్మిక సంక్షేమమే లక్ష్యం: లక్ష్మణ్ | goal to Labour Welfare :Laxman | Sakshi
Sakshi News home page

కార్మిక సంక్షేమమే లక్ష్యం: లక్ష్మణ్

Jun 2 2016 4:02 AM | Updated on Mar 29 2019 9:31 PM

కార్మిక సంక్షేమమే లక్ష్యం: లక్ష్మణ్ - Sakshi

కార్మిక సంక్షేమమే లక్ష్యం: లక్ష్మణ్

కార్మికుల సంక్షేమానికి, సామాజిక భద్రతకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు.

సాక్షి, హైదరాబాద్: కార్మికుల సంక్షేమానికి, సామాజిక భద్రతకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘వికాసపర్వం’లో భాగంగా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం బీజేపీ మజ్దూర్ మోర్చా సమావేశం జరిగింది. ఇందులో లక్ష్మణ్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. గతంలో చిన్న వ్యాపారులకు అప్పులు పుట్టక ఇబ్బం దులు పడ్డారని, అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్ర బ్యాంకు ద్వారా వారికి రుణాలు ఇస్తోందన్నారు. వీటిని అట్టడుగు ప్రజల్లోకి తీసుకుపోయి ప్రచారంచేయాలని లక్ష్మణ్ కోరారు. మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు టి.కృష్ణమూర్తి, నేతలు ధర్మారెడ్డి, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement