అంబర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్:
అంబర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమైందని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గీత(20) అనే యువతి గణేశ్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏమైందో ఏమో కానీ ఈ విషయంలో గీతను గణేశ్ మోసం చేశాడు.
దీంతో మనస్తాపం చెందిన గీత తన ఆత్మహత్యకు ప్రియుడు గణేశ్ కారణమని సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.