ప్రేమ వేధింపులు: బాలిక ఆత్మహత్య | girl commits suicide due to love harassments | Sakshi
Sakshi News home page

ప్రేమ వేధింపులు: బాలిక ఆత్మహత్య

Oct 15 2016 3:46 PM | Updated on Sep 4 2017 5:19 PM

ప్రేమ వేధింపులతో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్: ప్రేమ వేధింపులతో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్‌నగర్లో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముండే ముత్యాల సోనీ(17) అనే మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన సూరజ్ గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో అతని ప్రేమను నిరాకరిస్తూ వచ్చింది. గత కొన్ని రోజులుగా వేధింపులు ఎక్కువ కావడంతో.. బాలిక మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించింది.
 
ఈ అంశంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. సూరజ్ వల్ల తనకు, తన కుంటుంబానికి ప్రాణహాని ఉందని భావించిన బాలిక శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. అయితే విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. చనిపోవడానికి ముందు బాలిక సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. ఈ అంశంపై పోలీసులను వివరణ కోరగా వారి వాదన వేరే విధంగా ఉంది. బాలిక ఆత్మహత్యకు ముందు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement