హే..గాంధీ! | Gandhi in hospital nirvakam | Sakshi
Sakshi News home page

హే..గాంధీ!

Mar 2 2016 12:52 AM | Updated on Sep 3 2017 6:46 PM

హే..గాంధీ!

హే..గాంధీ!

తుప్పుపట్టిన స్ట్రెచర్లపై రోగులను తరలిస్తుండగా హఠాత్తుగా స్ట్రెచర్ విరిగిపోవడంతో రోగులు కిందపడి

ఒకే స్ట్రెచర్‌పై ఇద్దరు రోగులు..
వార్డుకు తరలిస్తుండగా విరిగిన స్ట్రెచర్..
కిందపడిపోయి గాయాల పాలైన రోగులు
గాంధీ ఆస్పత్రిలో నిర్వాకం
 

గాంధీ ఆస్పత్రి : తుప్పుపట్టిన స్ట్రెచర్లపై రోగులను తరలిస్తుండగా హఠాత్తుగా స్ట్రెచర్ విరిగిపోవడంతో రోగులు కిందపడి గాయాలపాలయ్యారు. ఈ ఘటన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం ఐదవ అంతస్థులోని నెఫ్రాలజీ వార్డులో చికిత్స పొందుతున్న ఇరువురు మహిళా రోగులను ఒకే స్ట్రెచర్‌పై కూర్చుండబెట్టి సెల్లార్‌లో ఉన్న రేడియాలజీ విభాగానికి తీసుకువచ్చి ఎక్స్‌రేలు తీయించారు.

తిరిగి వార్డుకు తరలిస్తుండగా  తుప్పుపట్టిన స్ట్రెచర్ విరిగిపోవడంతో దానిపై కూర్చున్న రోగులు ఒక్కసారిగా కిందపడిపోయారు. హఠాత్పరిణామంతో ఆందోళనకు గురైన రోగులు గట్టిగా కేకలు వేశారు. గమనించిన రోగి సహాయకులు, సెక్యూరిటీగార్డులు పరుగున వచ్చి కిందపడిన మహిళా రోగులను పైకిలేపి కూర్చోబెట్టారు. ఈ ఘటనలో ఇరువురు మహిళా రోగులు స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం మరో స్ట్రెచర్ తీసుకువచ్చి రోగులను వార్డుకు తరలించారు. దీనిపై రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement