జూ పార్క్ 'చిల్డ్రన్స్ డే' గిఫ్ట్ | free admission to the Children in zoo park | Sakshi
Sakshi News home page

జూ పార్క్ 'చిల్డ్రన్స్ డే' గిఫ్ట్

Nov 12 2015 7:49 PM | Updated on Sep 4 2018 5:07 PM

నెహ్రూ జూలాజికల్ పార్కులో ఈ నెల 14వ తేదీన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని 14 ఏళ్లల్లోపు విద్యార్థులకు జూలో ఉచిత ప్రవేశం.

నెహ్రూ జూలాజికల్ పార్కులో ఈ నెల 14వ తేదీన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని 14 ఏళ్లల్లోపు విద్యార్థులకు జూలో ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నామని క్యూరేటర్ గోపిరవి గురువారం తెలిపారు. నగరంతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులకు కూడా ఈ సదుపాయం ఉంటుందని అన్నారు.

వెంట ఉపాధ్యాయులు ఉంటేనే జూలో ఉచిత ప్రవేశం కల్పిస్తామన్నారు. 10 మంది కంటే ఎక్కువ విద్యార్థులు బృందాలుగా వచ్చినా వారికి ఉచిత ప్రవేశం ఇస్తామన్నారు. చిన్నారుల వెంట పెద్దలు ఉంటేనే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. పాఠశాలల యజమానులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement