అపార్టుమెంట్‌లో అగ్నిప్రమాదం | fire accident in apartment at kukatpally | Sakshi
Sakshi News home page

అపార్టుమెంట్‌లో అగ్నిప్రమాదం

Nov 29 2016 12:53 AM | Updated on Sep 5 2018 9:47 PM

కూకట్‌పల్లిలోని ఓ అపార్టుమెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: కూకట్‌పల్లిలోని ఓ అపార్టుమెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక వివేకానందనగర్ కాలనీలోని సప్తగిరి అపార్టుమెంట్‌లో ఫ్లాట్ నంబర్-301లో సోమవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో అపార్టుమెంట్ వాసులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. అయితే, ప్రమాదం కారణంగా జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement