నేటి నుంచి తుది విడత కౌన్సెలింగ్ | Final phase counselling from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి తుది విడత కౌన్సెలింగ్

Jul 24 2016 3:20 AM | Updated on Sep 4 2017 5:54 AM

ఇంజనీరింగ్ సీట్ల భర్తీకోసం నిర్వహించిన ఎంసెట్-1 తుది విడత కౌన్సెలింగ్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. మొత్తంగా 26 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

- 24న ధ్రువపత్రాల పరిశీలన, 25 వరకు ఎంసెట్ 1 వెబ్‌ఆప్షన్లు
- ఎంసెట్-1 కౌన్సెలింగ్ వివరాలు
- తొలుత ప్రకటించిన సీట్లు        9,123
- కేటాయించిన సీట్లు        57,940
- మిగిలిపోయిన సీట్లు        11,183
 - గడువులోగా రిపోర్టు చేసినది    44,420
-  తుదిదశకు కొత్తగా జతయిన సీట్లు    1,403
-  తుదిదశకు అందుబాటులోని సీట్లు    26,106
 
 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీకోసం నిర్వహించిన ఎంసెట్-1 తుది విడత కౌన్సెలింగ్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. మొత్తంగా 26 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలిదశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుని సీట్లు రాని అభ్యర్థులతోపాటు ఎంసెట్‌లో ర్యాంకులు పొందినా తొలిదశ కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. 24న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 21 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఇక తొలిదశలో సీట్లు పొందిన అభ్యర్థులు కూడా మెరుగైన కళాశాల/కోర్సులను ఎంచుకునేందుకు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. 24, 25వ తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
 
 ఈనెల 27న రాత్రి 8 గంటల తర్వాత సీట్ల కేటాయింపు చేపడతారు. ఇక జేఎన్టీయూహెచ్ ఇటీవల అఫిలియేషన్ ఇచ్చిన మరో మూడు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులను ఏఎఫ్‌ఆర్సీ నిర్ధారించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో తొలిదశలో మిగిలిపోయిన సీట్లకు అదనంగా మరో 1,403 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే మరో రెండు బీఫార్మసీ కళాశాలలకు, ఒక ఫార్మ్-డి కళాశాలకు జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ ఇచ్చినందున.. వాటికి కూడా ఏఎఫ్‌ఆర్సీ ఫీజులను నిర్ధారించింది. మరో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో 60 సివిల్ ఇంజనీరింగ్ సీట్లకు అనుమతిస్తూ ఇంకో ఉత్తర్వును విద్యాశాఖ జారీచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement