ఓ మోస్తరు కాలేజీకి రూ. 12 లక్షలు! | In Telangana, theres a high demand for engineering seats | Sakshi
Sakshi News home page

ఓ మోస్తరు కాలేజీకి రూ. 12 లక్షలు!

Jul 22 2025 8:48 AM | Updated on Jul 22 2025 1:33 PM

In Telangana, theres a high demand for engineering seats
  • ఇంజనీరింగ్‌ బీ కేటగిరీ సీట్లకు పెరిగిన గిరాకీ
  • మంచి కాలేజీలో, మంచి బ్రాంచీ కోసం విద్యార్థుల యత్నాలు.. 
  • టాప్‌ కాలేజీల్లో రూ.19 లక్షల వరకూ
  • దండుకుంటున్నారనే ఆరోపణలు– జేఈఈ, ఎప్‌సెట్‌ ర్యాంకుల ఆధారంగా ఇవ్వాల్సి ఉన్నా యాజమాన్యాల ఇష్టారాజ్యం
  • ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్నవిద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు 
  • ఆగస్టు 10 నాటికి సీట్ల భర్తీ పూర్తి చేయాలఉన్నత విద్యా మండలి.. 
  • భర్తీ విధానానికి   మార్గదర్శకాలు జారీ

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు కాలేజీల్లో ఇంజనీరింగ్‌ యాజమాన్య కోటా సీట్లకు గిరాకీ పెరిగింది. బీ కేటగిరీలో తొలి విడత సీట్ల కేటాయింపు తర్వాత విద్యార్థులు మంచి కాలేజీ, డిమాండ్‌ ఉన్న బ్రాంచి కోసం ప్రయత్నిస్తుండటంతో టాప్‌ కాలేజీల్లో సీట్లు వేగంగా భర్తీ అవుతున్నాయి. సాధారణ కాలేజీల్లో మాత్రం కొంత మందకొడిగా సాగుతోంది. అయితే ఈ యాజమాన్య కోటా సీట్ల భర్తీలో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. డబ్బులు ఎక్కువ ఇచ్చిన వారికే సీట్లు దక్కుతు న్నాయని తల్లిదండ్రులు చెబుతుండగా.. ఆధారా లతో ఫిర్యాదు చేయనిదే తామేమీ చేయలేమని అధికారులు అంటున్నారు.

రూ.12 లక్షల పైమాటే...
కంప్యూటర్‌ కోర్సులకు కాలేజీలు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నాయి. ఒక మోస్తరు కాలేజీలే సీటుకు రూ.12 లక్షలు (డొనేషన్‌ కింద) వసూలు చేస్తున్నాయి. ఇక టాప్‌ కాలేజీలైతే రూ.19 లక్షల వరకూ తీసుకుంటున్నాయని తెలుస్తోంది. ఇది కాకుండా కాలేజీని బట్టి వార్షిక ఫీజూ ఉంటుంది. రాష్ట్రంలో 1.06 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లున్నాయి. వీటిల్లో దాదాపు 23 వేల సీట్లు యాజమాన్య కోటా కింద ఉండగా.. 21 వేల సీట్లు కంప్యూటర్‌ సంబంధిత బ్రాంచీల్లోనే ఉన్నాయి. 

మిగతావి ఇతర కోర్‌ గ్రూపుల సీట్లన్నమాట. యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి ఈ నెల 17న నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆగస్టు 10 నాటికి సీట్ల భర్తీ పూర్తి చేయాలని పేర్కొంది. భర్తీ విధానానికి మార్గదర్శకాలూ ఇచ్చింది. ఒక పక్క కన్వీనర్‌ కోటాకు కౌన్సెలింగ్‌ జరుగుతుండగా, మరోపక్క యాజమాన్య కోటా సీట్ల భర్తీని చేపడుతున్నారు.

పేరుకే నిబంధనలు!
మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు రెండు కేటగిరీలుగా ఉంటాయి. ఇందులో ‘బీ’ కేటగిరీ సీట్లను జేఈఈ, ఎప్‌సెట్‌లో ర్యాంకు ఆధారంగా ఇవ్వాలి. ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ధారించిన ఫీజు తీసుకోవాలి. ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌ వీరికి వర్తించదు. అయితే ర్యాంకర్లు రాలేదని చెబుతూ ఈ సీట్లను యాజమా న్యాలు ఇష్టారాజ్యంగా ఇచ్చేస్తున్నాయి. ఇక ‘సీ’ కేటగిరీ సీట్లను ప్రవాస భారతీయుల పిల్లలకు ఇవ్వాలి. 

ఏటా 5 వేల డాలర్ల ఫీజు వసూలు చేయాలి. కానీ ‘సీ’ కేటగిరీకి పెద్దగా దరఖా స్తులు రావు. వీటిని కూడా యాజమాన్యాలు డబ్బులు ఇచ్చిన వారికే కేటాయిస్తున్నాయి. ర్యాంకర్లు తాము పలానా కాలేజీకి దరఖాస్తు చేసినట్టు తెలిపేందుకు ఎలాంటి ఆధారాలు లేకపోవ డంతో కాలేజీలపై చర్యలు తీసుకోవడం అధికారులకు కష్టంగా ఉంది. దీంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా సీట్లు అమ్ము కుంటున్నాయని, దీనిపై ప్రభుత్వ దృష్టి సారించాల్సిన అవస రం ఉందని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కోరుతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement