ఉస్మానియాలో మహిళా రోగి ఆత్మహత్య | Female patient committed suicide in Osmania | Sakshi
Sakshi News home page

ఉస్మానియాలో మహిళా రోగి ఆత్మహత్య

Jul 6 2016 7:24 PM | Updated on Nov 6 2018 7:56 PM

డయాలసిస్ చికిత్స పొందుతున్న ఓ మహిళ ఉస్మానియా ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

డయాలసిస్ చికిత్స పొందుతున్న ఓ మహిళ ఉస్మానియా ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్‌కు చెందిన యాదమ్మ(50) కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతోంది. ఈ మేరకు డయాలసిస్ చికిత్స కోసం రెండు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో చేరింది. కాగా తాను త్వరలో చనిపోతాననే ఆందోళనతో మానసికంగా కుంగిపోయి మనస్థాపానికి గురై భవనంపై నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన యాదమ్మ అక్కడికక్కడే చనిపోయింది.

 

Advertisement
 
Advertisement
Advertisement