‘బ్రహ్మోత్సవం’ థియేటర్‌లో ఫ్యాన్స్ ఆందోళన | fans protest in Brahmotsavam theater | Sakshi
Sakshi News home page

‘బ్రహ్మోత్సవం’ థియేటర్‌లో ఫ్యాన్స్ ఆందోళన

May 20 2016 8:03 PM | Updated on Sep 4 2017 12:32 AM

‘బ్రహ్మోత్సవం’ థియేటర్‌లో ఫ్యాన్స్ ఆందోళన

‘బ్రహ్మోత్సవం’ థియేటర్‌లో ఫ్యాన్స్ ఆందోళన

అమీర్‌పేట బిగ్‌బజార్‌లోని బిగ్‌సినిమాస్‌లో శుక్రవారం అభిమానులు ఆందోళన చేశారు.

హైదరాబాద్‌ : అమీర్‌పేట బిగ్‌బజార్‌లోని బిగ్‌సినిమాస్‌లో శుక్రవారం అభిమానులు ఆందోళన చేశారు. ఈ రోజు  విడుదలైన బ్రహ్మాత్సవం సినిమా సాయంత్రం షోలో అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. సినిమా మొదటిభాగం తర్వాత ఏసీలు పనిచేయకపోవడంతో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. ఎంతసేపటికీ ఏసీలు పనిచేయకపోవడంతో సినిమాను నిలుపుదల చేశారు. అభిమానుల నిరసన మేరకు వారి సినిమా టికెట్ ధరను బిగ్‌సినిమాస్ యాజమాన్యం వెనక్కి ఇచ్చారు. మల్టీప్లెక్స్‌లలో సినిమా మధ్యలో సాంకేతిక లోపాలు రాకుండా తగు జాగ్రత్తలు, ప్రత్యామ్నయ చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement