-
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగమ్మాయి హాలీవుడ్ సినిమా.. ఆ సాంగ్ స్పెషల్
మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమై నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న అవంతిక వందనపు హాలీవుడ్లో సత్తా చాటుతుంది. తాజాగా ఆమె నటించిన హాలీవుడ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మధ్య టాలీవుడ్ ప్రేక్షలు కూడా భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలను చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అవంతిక నటించిన చిత్రం తాజాగా ఓటీటీలోకి రావడంతో అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు క్రేజీగా చూస్తున్నారు. హాలీవుడ్లో 'మీన్ గర్ల్స్- ది మ్యూజికల్' అనే సినిమాలో అవంతిక కీలకపాత్ర పోషించింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రంలో ఆమె నటన పట్ల హాలీవుడ్ ప్రేక్షకులు ప్రశంసించారు. టీన్ కామెడీ చిత్రంగా వచ్చిన ఇందులో హాలీవుడ్ ప్రముఖ నటులతో కలిసి అవంతిక నటించింది. ఈ చిత్రంలోని బోల్డ్ సాంగ్ ఒకటి ఇప్పటికీ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. 'మీన్ గర్ల్స్-ది మ్యూజికల్' అనే సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్‌ను అందుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే హాలీవుడ్లో ట్రెండింగ్ అవుంతుంది. కానీ ఈ సినిమాను ప్రస్తుతం ఇండియన్ ప్రేక్షకులు చూడలేరు. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో ఇండియన్ ప్రేక్షకులకు కూడా యాక్సెస్ రావచ్చని సమాచారం. 'బ్రహ్మోత్సవం' సినిమాలో మహేశ్ బాబుకు చెల్లెలుగా నటించిన అవంతిక పలు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించింది. కానీ ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ ఆమె కనిపించలేదు. ప్రస్తుతం ఆమె నటించిన మరో రెండు హాలీవుడ్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు మూడు హాలీవుడ్ వెబ్ సిరీస్‌ల్లోనూ అవంతిక నటిస్తోంది. -
విశ్వకర్మ నిర్మించిన ఆలయం ఇప్పటికీ తిరుమలలో ఉందా ...?
-
రేపు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
-
‘బ్రహ్మోత్సవం’ థియేటర్లో ఫ్యాన్స్ ఆందోళన
హైదరాబాద్ : అమీర్‌పేట బిగ్‌బజార్‌లోని బిగ్‌సినిమాస్‌లో శుక్రవారం అభిమానులు ఆందోళన చేశారు. ఈ రోజు విడుదలైన బ్రహ్మాత్సవం సినిమా సాయంత్రం షోలో అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. సినిమా మొదటిభాగం తర్వాత ఏసీలు పనిచేయకపోవడంతో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. ఎంతసేపటికీ ఏసీలు పనిచేయకపోవడంతో సినిమాను నిలుపుదల చేశారు. అభిమానుల నిరసన మేరకు వారి సినిమా టికెట్ ధరను బిగ్సినిమాస్ యాజమాన్యం వెనక్కి ఇచ్చారు. మల్టీప్లెక్స్‌లలో సినిమా మధ్యలో సాంకేతిక లోపాలు రాకుండా తగు జాగ్రత్తలు, ప్రత్యామ్నయ చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్‌దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
Advertisement