బీడీఎల్‌లో పేలుడు పదార్థాల నిల్వకేంద్రం ప్రారంభం | explosive storage facility inaugurated at bdl | Sakshi
Sakshi News home page

బీడీఎల్‌లో పేలుడు పదార్థాల నిల్వకేంద్రం ప్రారంభం

Jan 5 2017 7:47 PM | Updated on Sep 5 2017 12:30 AM

బీడీఎల్‌లో పేలుడు పదార్థాల నిల్వకేంద్రం ప్రారంభం

బీడీఎల్‌లో పేలుడు పదార్థాల నిల్వకేంద్రం ప్రారంభం

భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో ఏర్పాటుచేసిన పేలుడు పదార్థాల నిల్వ కేంద్రాన్ని రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే ప్రారంభించారు.

భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన పేలుడు పదార్థాల నిల్వ కేంద్రాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ భమ్రే ప్రారంభించారు. గురువారం నాడు బీడీఎల్‌ను సందర్శించిన ఆయనకు సీఎండీ ఉదయభాస్కర్ సాదరస్వాగతం పలికారు. బీడీఎల్ సీనియర్ అధికారులతో పాటు వివిధ సంఘాల నేతలను కూడా కేంద్రమంత్రి కలిశారు. 
 
ప్రస్తుతం కొనసాగుతున్న ఉత్పత్తి కార్యకలాపాలతో పాటు భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల గురించి కూడా సీఎండీ ఆయనకు వివరించారు. ఫ్యాక్టరీలోని వివిధ ఉత్పత్తి కేంద్రాలను మంత్రి పరిశీలించారు. అనంతరం కంచన్‌బాగ్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన పేలుడు పదార్థాల నిల్వకేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీడీఎల్ ఉన్నతాధికారులు ఎస్. పిరమనాయగం, వి.గురుదత్త ప్రసాద్, కె. దివాకర్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement