మారిన ఎంసెట్-2 షెడ్యూల్ | Eamcet-2 Schedule has been changed | Sakshi
Sakshi News home page

మారిన ఎంసెట్-2 షెడ్యూల్

Jun 7 2016 8:35 PM | Updated on Sep 4 2017 1:55 AM

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి జూలై 9న నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ఎంసెట్-2కు హాజరుకావాలనుకునే అభ్యర్థుల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి జూలై 9న నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ఎంసెట్-2కు హాజరుకావాలనుకునే అభ్యర్థుల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువును (ఆలస్య రుసుము లేకుండా) ఈనెల 14వ తేదీ వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. వాస్తవానికి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల గడువు మంగళవారం రాత్రితో ముగిసింది. అయితే, విద్యార్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించినట్లు వెల్లడించారు. దీంతో ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఇతర షెడ్యూలులోనూ మార్పులు చోటుచేసుకున్నట్లు తెలిపారు.

ఈ నెల 1వ తేదీ నుంచి మంగళవారం రాత్రి 7 గంటల వరకు 51,009 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని తెలంగాణ జిల్లాల నుంచి 33163 మంది, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో నుంచి 9678 మంది, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని జిల్లాల నుంచి 6691 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 1477 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో అధికారులు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement