డీజీపీ కార్యాలయంలో ‘క్రష్’ ఏర్పాటు | DGP office plans to build crush | Sakshi
Sakshi News home page

డీజీపీ కార్యాలయంలో ‘క్రష్’ ఏర్పాటు

May 7 2016 9:05 PM | Updated on Sep 3 2017 11:37 PM

రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల చిన్న పిల్లల కోసం ‘క్రష్' (చిన్న పిల్లల సంరక్షణ కేంద్రం)’ ఏర్పాటుకు పోలీసు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది.

హైదరాబాద్: రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల చిన్న పిల్లల కోసం ‘క్రష్' (చిన్న పిల్లల సంరక్షణ కేంద్రం)’ ఏర్పాటుకు పోలీసు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. డీజీపీ కార్యాలయంలో పలువురు మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారు చిన్నారుల సంరక్షణ పట్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో చిన్నారుల సంరక్షణ కోసం ‘క్రష్’ ఏర్పాటు చేయాలని పోలీసు సంక్షేమ విభాగం నిర్ణయించింది. ఈ మేరకు డీజీపీ అనురాగ్‌శర్మ ఆమోదం తెలిపారు. దీంతో వారం రోజుల్లో క్రష్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పోలీసు సంక్షేమ విభాగం ఐజీ సౌమ్యమిశ్రా చర్యలు ప్రారంభించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement