నగరంలో అక్రమ బంగారం అమ్మకాలపై డైరెక్టర్ జనరల్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటె లిజెన్స్ (డీజీసీఐ) నిఘా పెట్టింది.
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ బంగారం అమ్మకాలపై డైరెక్టర్ జనరల్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటె లిజెన్స్ (డీజీసీఐ) నిఘా పెట్టింది. హైదరాబాద్‌లోని 15 దుకాణాలకు శుక్రవారం సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం డీజీసీఐ నోటీసులిచ్చింది. గత నాలుగు రోజులుగా విక్రయించిన బంగారం, వజ్రాభరణాల లావాదేవీల పూర్తి వివరాలను 24 గంటల్లోగా తెలపాలని బంగారం వ్యాపారులను ఆదేశించింది.
నగరంలో అక్రమ బంగారం వ్యాపారం, నల్లకుబేరుల ఆటకట్టించేందుకు 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీజీసీఐ తెలిపింది. మరోవైపు చెన్నై నగరంలో ఏకకాలంలో ఎనిమిది చోట్ల శుక్రవారం ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. చెన్నైలోని ప్రముఖ వ్యాపార కూడలి ప్యారిస్, ఎన్‌ఎస్‌సీ బోస్ రోడ్లలోని బంగారు దుకాణాలు, మనీ ఎక్చేంజ్ సెంటర్లు, అనుమానిత హవాల కేంద్రాలపై దాడులు చేశారు. అయితే ఈ దాడుల్లో ఎంత సొమ్ము పట్టుబడిందన్న వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.