గిరాకీని కాపాడుకునేందుకు హైదరాబాద్‌లో వ్యాపారుల యత్నం
- మంగళవారం పలు బ్యాంకులకు సుమారు మూడువేల వినతులు
- పది జాతీయ బ్యాంకులు సహా ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయిస్తున్న వైనం
- నిబంధనలను సడలించాలని కోరుతున్న వ్యాపారులు
సాక్షి, హైదరాబాద్: ప్రజల చేతిలో చిల్లర లేదు.. దుకాణాల్లో గిరాకీ లేదు.. దీంతో తమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి దుకాణ నిర్వాహకులు స్వైపింగ్ యంత్రాల కోసం బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులు స్వైపింగ్ చేసే యంత్రాలకు ఇప్పుడు గిరాకీ పెరిగింది. హైదరాబాద్‌లోని వ్యాపారులు గిరాకీని కాపాడుకునేందుకు స్వైపింగ్ యంత్రాలు కావాలంటూ ఎస్‌బీఐ, సెంట్రల్‌బ్యాంక్, ఎస్‌బీహెచ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర పది జాతీయ బ్యాంకులతో సహా ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌మహీంద్ర వంటి ప్రైవేటు బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు. రోజూ వేల రూపాయల వ్యాపారం నిర్వహించే తినుబండారాల దుకాణదారులు, ఫుట్‌పాత్, వీధి వ్యాపారులు కూడా ఈ యంత్రాలుంటేనే తమ వ్యాపారానికి ఢోకా ఉండదని భావిస్తున్నట్లు సమాచారం.
మంగళవారం ఒకే రోజు ఆయా బ్యాంకులకు సుమారు మూడువేల స్వైపింగ్ యంత్రాలు కావాలంటూ నుంచి విజ్ఞప్తులు అందినట్లు బ్యాంకింగ్ రంగ నిపుణులు తెలపడం గమనార్హం. ఈనెల 8 నుంచి బహిరంగ మార్కెట్‌లో రూ.500, వెరుు్య నోట్ల చలామణి కష్టతరం కావడం, చిల్లర కష్టాలు మొదలైన నేపథ్యంలో ఈ యంత్రాలకు గిరాకీ పెరిగినట్లు తెలిసింది. కాగా ఈ యంత్రాలను పొందడం అందరికీ సాధ్యపడడం లేదు. మూడేళ్ల ఐటీ రిటర్న్స్, పాన్‌కార్డు, చిరునామా ధ్రువీకరణ, వ్యాట్, లేబర్ సర్టిఫికెట్ వంటి ప్రభుత్వ పరమైన గుర్తింపులు, ధ్రువీకరణలు కలిగి ఉన్న కరెంట్ అకౌంట్ వినియోగదారులకు మాత్రమే ఈ యంత్రాలను సరఫరా చేయనున్నట్లు బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు.
వీధి వ్యాపారాల్లో అధికంగా కూరగాయలు, పండ్లు, టీ, బ్యాగులు, ఫ్యాన్సీ ఐటమ్స్, తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఉన్నారుు. వీరిలో 70 శాతం మంది మాత్రమే బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని, ఇందులోనూ ఎక్కువగా సేవింగ్స్ అకౌంట్‌లున్నవారే కావడం గమనార్హం. ఒకవేళ బ్యాంకు అకౌంట్ ఉన్నప్పటికీ ప్రస్తుత బ్యాంకుల నిబంధనల ప్రకారం స్వైపింగ్ యంత్రాలు పొందే అర్హతలున్నవారు సగం మంది మాత్రమే ఉన్నారని ఆయా వ్యాపారాలు నిర్వహించేవారు వాపోతున్నారు. బ్యాంకు అకౌంట్ కలిగిన ప్రతి వ్యాపారికి ఈ యంత్రాలను సరఫరా చేసి నెలవారీ అద్దె వసూలు చేసుకోవాలని ఆయా వ్యాపారులు బ్యాంకర్లను కోరుతున్నారు.
‘స్వైపింగ్’ యంత్రాలకు డిమాండ్!
Published Wed, Nov 16 2016 12:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement