అసహనంపై పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.
హైదరాబాద్: అసహనంపై పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించడం సరికాదన్న ఆయన అడిగిన దానికన్నా ఎక్కువ నిధులను కేంద్రం ఇస్తుందని స్పష్టం చేశారు. అమృత్ పథకం కింద తెలంగాణకు కెటాయించిన నిధులే ఇందుకు నిదర్శనమని తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారంలో వామపక్షాలకు చిత్తశుద్ధి లోపించిందని దత్తాత్రేయ విమర్శించారు.