'టీఆర్ఎస్ ఏ ముఖంతో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది' | D. Sridhar Babu takes on TRS party | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ ఏ ముఖంతో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది'

Mar 31 2014 1:59 PM | Updated on Sep 2 2017 5:24 AM

'టీఆర్ఎస్ ఏ ముఖంతో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది'

'టీఆర్ఎస్ ఏ ముఖంతో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది'

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్తో పొత్తుకు ససేమిర అని ఇప్పడు బీజేపీతో పొత్తుకు యత్నిస్తోన్న టీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి డి.శ్రీధర్ బాబు నిప్పులు చెరిగారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్తో పొత్తుకు ససేమిర అని ఇప్పడు బీజేపీతో పొత్తుకు యత్నిస్తోన్న టీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డి.శ్రీధర్ బాబు నిప్పులు చెరిగారు. సోమవారం హైదరాబాద్లో శ్రీధర్ బాబు మాట్లాడుతూ... పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఓడించేందుకు బీజేపీ యత్నించిందని ఆయన ఆరోపించారు. అలాంటి బీజేపీతో టీఆర్ఎస్ ఏ ముఖంతో పొత్తు పెట్టుకుంటుందంటూ ప్రశ్నించారు.

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలే టీఆర్ఎస్కు బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి... మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చిన జిల్లాకు చెందిన పెద్దపల్లి ఎంపీ  వివేక్ చేరికపై తనకు సమాచారం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాన్ని నమ్మి తామంతా పని చేశామని... కానీ వివేక్ వంటి వారు కాంగ్రెస్పై నమ్మకం లేక పార్టీని విడిచి  వెళ్లారన్నారు. వివేక్ మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరికపై క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను తమ పార్టీ అధిష్టానానికి వివరిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement