క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌ | cricket betting gang arrested in hyderabad | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

Apr 19 2017 2:00 PM | Updated on Sep 5 2017 9:11 AM

ఐపీఎల్‌-10 సందర్భంగా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌: ఐపీఎల్‌-10 సందర్భంగా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. నగరంలోని వనస్థలిపురంలో క్రికెట్‌ బెట్టింగ్‌ సాగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడులు నిర్వహించారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.40 లక్షల నగదుతో పాటు 9 సెల్‌ఫోన్లు, ఓ ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement