కానిస్టేబుళ్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు తెలంగాణ డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
Feb 20 2017 3:08 PM | Updated on Mar 19 2019 6:03 PM
హైదరాబాద్: కానిస్టేబుళ్ల నియామకాలకు జరిగిన పరీక్షల ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ కానిస్టేబుల్ పరీక్ష రాసినవారు తెలంగాణ డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. 2016లో కానిస్టేబుళ్ల నియామకానికి నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అయితే ఈ ఫలితాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారని ఆరోపించారు.
కాగా, మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఉంటుందని ప్రకటించి ఇప్పుడు 10 శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించారని మహిళా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై డీజీపీ స్పందించారు. ఎలాంటి అక్రమాలు జరగలేదని, కటాఫ్ మార్కులపై అనుమానాలుంటే రిక్రూట్‌మెంట్ బోర్డులో ఫిర్యాదు చేయవచ్చని డీజీపీ సూచించారు. కటాఫ్ మార్కులను వెబ్ సైట్ లో పెట్టాలని ఆదేశించినట్టు డీజీపీ తెలిపారు.
Advertisement
Advertisement