కానిస్టేబుల్‌ను పట్టుకొచ్చి పెళ్లి జరిపించారు | constable marriage conducted by women leaders in hyderabad | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ను పట్టుకొచ్చి పెళ్లి జరిపించారు

Feb 7 2016 7:44 PM | Updated on Mar 19 2019 5:56 PM

కానిస్టేబుల్‌ను పట్టుకొచ్చి పెళ్లి జరిపించారు - Sakshi

కానిస్టేబుల్‌ను పట్టుకొచ్చి పెళ్లి జరిపించారు

ప్రేమిస్తున్నానని వెంటపడి మూడు సంవత్సరాలు కలిసి తిరిగి పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతున్న కానిస్టేబుల్‌ వివాహం హైదరాబాద్లో జరిగింది.

హైదరాబాద్: ప్రేమిస్తున్నానని వెంటపడి మూడు సంవత్సరాలు కలిసి తిరిగి పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతున్న కానిస్టేబుల్‌ వివాహం హైదరాబాద్లో జరిగింది. భారతీయ మహిళా సమాఖ్య నాయకులు, పోలీసుల నేతృత్వంలో ఆదివారం కానిస్టేబుల్ను ఓ ఇంటి వాడిని చేశారు.  

నల్లగొండ జిల్లా బొల్లెనపల్లికి చెందిన నాగార్జున గోషామహల్ పోలీస్‌స్టేషన్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ హస్తినాపురంలో నివాసముంటున్నాడు. అదే గ్రామానికి చెందిన పుష్పలత హస్తినాపురంలో నివాసముంటోంది. పుష్పలత బీ.టెక్ చదివే సమయంలో నాగార్జునతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ కొంత కాలం ప్రేమించుకున్న తరువాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

కాగా, పుష్పలత పెళ్లి చేసుకోవాలని ఇటీవల కోరగా నాగార్జున తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో పుష్పలత ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భారతీయ మహిళా సమాఖ్య నాయకుల ఆధ్వర్యంలో నాగార్జునకు కౌన్సిలింగ్ నిర్వహించి ఎల్‌బీనగర్‌లోని ఓ ఆలయంలో వివాహం జరిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement