జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు.
రంగారెడ్డి జిల్లా: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కుత్బుల్లాపూర్ మండలం బాల్‌రెడ్డినగర్ కాలనీలో డబ్బుల పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్ధి ఇందుకూరి సూర్యప్రభ నాయకులతో కలసి ఆందోళనకు దిగారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోతుందన్న భయంతో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తోందని ఆమె ఆరోపించారు. ఒక్కో ఓటరుకు రూ.200 పంపిణీ చేస్తున్నారని.. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సూర్యప్రభ పోలీసులను కోరారు.