
'చంద్రబాబుపై అన్ని పోలీసుస్టేషన్లలో కేసులు'
ఢిల్లీ వెళ్తున్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించుకుని రావాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు.
హైదరాబాద్: ఢిల్లీ వెళ్తున్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించుకుని రావాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేకహోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి మోసం చేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు.
ప్రత్యేకహోదా అంశాన్ని నీరుగారిస్తే ప్రధాని మోదీ, చంద్రబాబుపై అన్ని పోలీసుస్టేషన్లలో కేసులు పెడతామని హెచ్చరించారు. రాజధాని భూములను తాకడానికి వీల్లేదన్నారు. రైతులను బ్లాక్ మెయిల్ చేసేలా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏపీలోని అన్ని మండలాలు, కలెక్టరేట్ల ఆఫీసుల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.