కేసీఆర్, భన్వర్ లాల్, సోమేశ్లపై విచారణ జరపాలి | cm, cec and ghmc commisionor must be enquired congress leader marri shashidhar reddy demands | Sakshi
Sakshi News home page

కేసీఆర్, భన్వర్ లాల్, సోమేశ్లపై విచారణ జరపాలి

Oct 30 2015 10:53 PM | Updated on Aug 14 2018 10:54 AM

కేసీఆర్, భన్వర్ లాల్, సోమేశ్లపై విచారణ జరపాలి - Sakshi

కేసీఆర్, భన్వర్ లాల్, సోమేశ్లపై విచారణ జరపాలి

జీహెచ్ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపు కుట్రపూరితంగా జరిగిందని,ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్, ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్, జీహెచ్‌ఎంసీ మాజీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ లపై విచారణ జరపాలని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

- ఓట్లతొలగింపులో సీఎం, సీఈసీ, జీహెచ్ఎంసీ కమిషనర్లపై కాంగ్రెస్ నేత మర్రి ఆరోపణలు

హైదరాబాద్:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఓట్ల తొలగింపు కుట్రపూరితంగా జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి..  ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్, ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్, జీహెచ్‌ఎంసీ మాజీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

పీసీసీ నాయకులు నిరంజన్‌తో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడిన మర్రి.. ఓట్ల తొలగింపు వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు జీహెచ్‌ఎంసీ పరిధిలో విచారణ చేపట్టడం హర్షనీయమని, సీమాంధ్ర సెటిలర్లు, ఉత్తర భారత దేశానికి చెందిన వారు, స్థానికంగా వున్న 30 శాతం మేర వున్న ముస్లిం మైనార్టీ ఓటర్ల పేర్లు జాబితాల నుంచి గల్లంతు చేసేందుకు కుట్ర జరిగిందన్నారు.

పార్టీ పక్షాన, వ్యక్తిగతంగా తాను చేసిన పిర్యాదుల వల్లే కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదే శించిందని గుర్తుచేశారు. 6.30లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించేందుకు జరిగిన ప్రయత్నాలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ఓట్ల తొలగింపునకు పూర్వం వున్న జాబితా ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరపాలనే అంశాన్ని తాము ఎన్నికల సంఘానికి స్పష్టం చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement