నిందితుల కాల్లిస్టులో జేఎన్టీయూ ప్రొఫెసర్ ! | cid investigation on eamcet - 2 leakage case | Sakshi
Sakshi News home page

నిందితుల కాల్లిస్టులో జేఎన్టీయూ ప్రొఫెసర్ !

Jul 28 2016 8:50 AM | Updated on Sep 29 2018 6:18 PM

ఎంసెట్ - 2 లీకేజీపై ప్రభుత్వానికి సీఐడీ గురువారం నివేదిక ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

హైదరాబాద్ : ఎంసెట్ - 2 పేపర్ లీకేజీపై సీఐడీ గురువారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఇప్పటికే సీఐడీ అదుపులో ఉన్న ఈ లీకేజీ సూత్రధారులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అదుపులో ఉన్న నిందితుల కాల్ లిస్ట్ ఆధారంగా అధికారులు దర్యాప్తును మమ్మరం చేశారు.

సీఐడీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎంసెట్ నిర్వహించాలా లేక వద్దా అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. అయితే నిందితుల కాల్లిస్టులో జేఎన్టీయూ ప్రొఫెసర్ సహా.. మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నెంబర్లు ఉన్నట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో గుర్తించారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement