‘పల్లెపల్లెకు బీజేపీ’ పరిశీలకులు | Chinta Sambamurthy comments about BJP Strengthening | Sakshi
Sakshi News home page

‘పల్లెపల్లెకు బీజేపీ’ పరిశీలకులు

Jun 1 2017 3:21 AM | Updated on Mar 29 2019 9:31 PM

‘పల్లెపల్లెకు బీజేపీ’ పరిశీలకులు - Sakshi

‘పల్లెపల్లెకు బీజేపీ’ పరిశీలకులు

బీజేపీని పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి పటిష్టం చేస్తూ.. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేలా కృషి చేస్తున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తెలిపారు.

చింతా సాంబమూర్తి వెల్లడి
 
సాక్షి, హైదరాబాద్‌: బీజేపీని పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి పటిష్టం చేస్తూ.. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేలా కృషి చేస్తున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తెలిపారు. పార్టీ సిద్ధాంతకర్త పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ శత జయంతి సందర్భంగా ‘పల్లెపల్లెకు బీజేపీ–ఇంటింటికీ మోదీ’ పేరిట చేపడుతున్న కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు 31 జిల్లాలకు పరిశీల కులుగా వ్యవహరిస్తారిని తెలిపారు.

బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌–నల్లగొండ, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలకు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ–నిజామాబాద్, రంగారెడ్డి, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి–మేడ్చల్‌–మల్కాజిగిరి, సంగారెడ్డి, నాగం జనార్దనరెడ్డి– వికారాబాద్, నల్ల గొండ, ఇంద్రసేనారెడ్డి–ఖమ్మం, వరంగల్‌– అర్బన్, పేరాల శేఖర్‌రావు–కరీంనగర్, నిర్మల్‌ జిల్లాలకు పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వీరంతా ఒక వారం ఒక జిల్లా, మరో వారం మరో జిల్లాలో పర్యటించి పార్టీ కార్యక్రమాన్ని పరిశీలిస్తారన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement