తల్లిని చంపి... ఇంట్లోనే పాతిపెట్టారు | chidren killed their mother brutally | Sakshi
Sakshi News home page

తల్లిని చంపి... ఇంట్లోనే పాతిపెట్టారు

Mar 9 2015 9:58 PM | Updated on Sep 2 2017 10:33 PM

అమ్మ ప్రేమను మరిచారు... పేగు బంధాన్ని మర్చిపోయారు.

హైదరాబాద్: అమ్మ ప్రేమను మరిచారు... పేగు బంధాన్ని మర్చిపోయారు. లాలిస్తూ తినిపించిన గోరు ముద్దలూ గుర్తుకు లేవు. కన్నతల్లిని కడతేర్చడమే కాదు, తాము ఉండే ఇంట్లోనే తవ్వి పాతి పెట్టేశారు అన్నా చెల్లెళ్లు. ఏడాది క్రితం నగరంలోని బేగంబజార్ ప్రాంతంలో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగు చూసింది. ఈ ఘటనలో అన్నా చెల్లెళ్లు, బాబు, కిరణ్‌తో పాటు హత్యకు సహకరించిన నజామ్ అనే వ్యక్తిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వివరాలు....బాబు, కిరణ్(మహిళ) చిన్నప్పుడే తండ్రి మరణించడంతో, వారి తల్లి మతం మారి ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. పిల్లలను కూడా మతం మార్చించగా... పెద్దయిన తర్వాత వారు తిరిగి హిందూ మతంలోకి మారినట్లు తెలుస్తోంది. దీనిపై వేధింపులు ఎక్కువ కావడంతో 2014 జనవరి 1న తల్లిని హత్యచేశారని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement