చికెన్@డబుల్ సెంచరీ | chicken rate reaches to two hundred | Sakshi
Sakshi News home page

చికెన్@డబుల్ సెంచరీ

Dec 25 2015 10:43 AM | Updated on Aug 25 2018 5:39 PM

చికెన్@డబుల్ సెంచరీ - Sakshi

చికెన్@డబుల్ సెంచరీ

చికెన్ ధరలు దడ పుట్టిస్తున్నా యి.

హైదరాబాద్: చికెన్ ధరలు దడ పుట్టిస్తున్నా యి. మొన్నటి వరకు రిటైల్ మార్కెట్లో కేజీ రూ.160కి లభించిన స్కిన్లెస్ చికెన్‌పై కిలోకు రూ.40 వరకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో లైవ్ కోడి కేజీ 120, డ్రెస్డ్ చికెన్ కిలో రూ.175, స్కిన్‌లెస్ రూ.205కు అమ్ముతున్నారు. గత వారం చికెన్ (స్కిన్‌తో) కిలో రూ.140, స్కిన్ లెస్ రూ.160 కు లభించింది. సోమవారం నుంచి స్కిన్ లెస్ చికెన్ కేజీ డబుల్ సెంచరీ దాటేసింది. దీంతో సామాన్యులు చికెన్ వైపు చూడాలంటేనే హడలెత్తే పరిస్థితి తలెత్తుతోంది.
 
పండుగల గిరాకీతో...
క్రిస్‌మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల గిరాకీని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు ధరలు పెంచినట్లు తెలుస్తోంది. నగర మార్కెట్లో ఒక్కోచోట ఒక్కోరకంగా ధరలు ఉండటమే ఇందుకు నిదర్శనం. సంక్రాంతి వరకు చికెన్ ధరలు అస్థిరంగానే ఉంటాయని వ్యాపారులు  చెబుతున్నారు. గుడ్లు, మటన్ ధర లు కూడా రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే పప్పులు, నూనెల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న తరుణంలో ఆ లిస్ట్లో చికెన్ కూడా చేరిపోయిందని మాంసం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement