ఆర్టీసీ డిపోల్లో సీసీ కెమెరాలు | cc cameras in RTC depots | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డిపోల్లో సీసీ కెమెరాలు

Dec 24 2014 3:19 AM | Updated on Aug 14 2018 3:37 PM

ఇప్పటి వరకు బస్టాండ్లకే పరిమితమైన సీసీ కెమెరాలను ఇక బస్సు డిపోల్లో కూడా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.

 సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు బస్టాండ్లకే పరిమితమైన సీసీ కెమెరాలను ఇక బస్సు డిపోల్లో కూడా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. గ్యారేజీల్లో బస్సుల మెయింటెనెన్స్ నిర్వహణలో సిబ్బంది పనితీరును పరిశీలించడం, సకాలంలో బస్సులు నడిచేలా చూడడం, బస్సులు, డిపోల్లో పరిశుభ్రతను మెరుగుపర్చడం ప్రధాన లక్ష్యాలుగా వీటిని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కొన్ని డిపోల్లో జరుగుతున్న చోరీల నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయోగాత్మకంగా 60 డిపోల్లో, 600 కెమెరాలను తొలుత ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణకు సంబంధించి జంటనగరాల పరిధిలోని 27 డిపోలు, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 33 డిపోల్లో వీటిని ఏర్పాటుచేయనున్నారు. నెలరోజుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.  ఇందుకోసం టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. వీటి ఏర్పాటుతో ఒనగూరే ప్రయోజనాలను సమీక్షించి అవసరమైతే మిగతా డిపోల్లో దశలవారీగా ఏర్పాటు చేయనున్నట్టు ఆర్టీసీ కార్యదర్శి రవీందర్ పేర్కొన్నారు.
 
 మళ్లీ బయోడీజిల్ ప్రయోగం...
 ఆర్టీసీకి అతిపెద్ద భారంగా ఉన్న చమురు ఖర్చును తగ్గించుకునే క్రమంలో బయోడీజిల్‌ను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో బయోడీజిల్‌ను ప్రయోగాత్మకంగా వినియోగించినప్పటికీ, దాని లభ్యతలో ఇబ్బంది, డీజిల్ కంటే ధర పెరగడం... తదితర కారణాలతో ఆ ప్రయోగాన్ని విరమించుకున్నారు. ఇప్పుడు డీజిల్ కంటే తక్కువ ధరకే బయోడీజిల్‌ను సరఫరా చేసేందుకు కొన్ని సంస్థలు ముందుకు రావడంతో మళ్లీ అధికారులు ఆ ప్రక్రియ వైపు దష్టి సారించారు. ప్రస్తుతం ఆర్టీసీ సంవత్సరానికి దాదాపు 50 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోంది. ఇందులో 10 బయోడీజిల్‌ను కలిపి వాడడం వల్ల సం్థకు రూ.30 కోట్ల మేర వార్షిక ఆదా నమోదవుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతోపాటు బస్సులు విడుదల చేసే హైడ్రోకార్బన్‌లు, కార్బన్ మోనాకై ్సడ్‌లను బాగా తగ్గించే అవకాశం ఉంటుంది. బయోడీజిల్ సరఫరా చేసే సంస్థలను ఆహ్వానిస్తూ తాజాగా టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement