స్కూల్ లో చిన్నారిపై అసభ్య ప్రవర్తన, కేసు నమోదు | case file for-misbehaving-with-girl-student in school | Sakshi
Sakshi News home page

స్కూల్ లో చిన్నారిపై అసభ్య ప్రవర్తన, కేసు నమోదు

Jun 21 2016 12:30 PM | Updated on Sep 4 2017 3:02 AM

ఓ ప్రైవేట్ స్కూలు సిబ్బంది విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: ఓ ప్రైవేట్ స్కూలు సిబ్బంది విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్‌లోని జాన్సన్స్ గ్రామర్ స్కూల్ లో ఐదో తరగతి చదువుకున్న విద్యార్థినితో స్కూల్ సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ విషయమై బాధితురాలు తల్లిదండ్రులకు తెలిపింది. వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ 354, పోస్కో సెక్షన్8 కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement