ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉపకార వేతనాలు


ఎంపికకు 31న పరీక్ష

సాక్షి, హైదరాబాద్: ఇంటర్ చదివే 25 మంది విద్యార్థినులకు నెలకు ఐదు వేల వంతున ఉపకారవేతనాలు ఇవ్వనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో విష్ణువర్ధన్, సీవోవో మోహన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికకు ఈనెల 31న గండిపేటలోని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్‌లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.


ఆబ్జెక్టివ్ పద్ధతిలో 100 మార్కులకు నిర్వహించే పరీక్షలో లెక్కలు, సైన్సు, ఇంగ్లీషు, సాంఘిక శాస్త్రం, కరెంటు అఫైర్స్, జనరల్ నాలెడ్జి, రీజనింగ్ ప్రశ్నలుంటాయి. విద్యార్థినులు www.ntrtrust.org ఎడ్యుకేషన్ విభాగంలో దరఖాస్తు నింపి, ఈ నెల 24 ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు రిజిష్టర్ చేసుకోవాలన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top