
'ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి'
రాజకీయాలకు అతీతంగా బంద్ను విజయవంతం చేద్దామని బొత్స పిలుపునిచ్చారు.
హైదరాబాద్: ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసానికి వ్యతిరేకంగా మంగళవారం చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ బంద్లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఇది ప్రజల కోసం, ప్రజల తరఫున చేస్తున్న పోరాటంగా ఆయన అభివర్ణించారు. రాజకీయాలకు అతీతంగా బంద్ను విజయవంతం చేద్దామని ఆయన అన్నారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందే అని బొత్స స్పష్టం చేశారు. ఇప్పటికే వివిధ రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, వర్తక, వాణిజ్య సంఘాలు బంద్కు మద్దతిచ్చాయని తెలిపారు. భావితరాల భవిష్యత్ కోసం ప్రత్యేక హోదా సాధిద్దామని, ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలన్నదే తమ డిమాండ్ అని బొత్స స్పష్టం చేశారు.