all people
-
'ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి'
హైదరాబాద్: ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసానికి వ్యతిరేకంగా మంగళవారం చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ బంద్‌లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఇది ప్రజల కోసం, ప్రజల తరఫున చేస్తున్న పోరాటంగా ఆయన అభివర్ణించారు. రాజకీయాలకు అతీతంగా బంద్‌ను విజయవంతం చేద్దామని ఆయన అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందే అని బొత్స స్పష్టం చేశారు. ఇప్పటికే వివిధ రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, వర్తక, వాణిజ్య సంఘాలు బంద్‌కు మద్దతిచ్చాయని తెలిపారు. భావితరాల భవిష్యత్ కోసం ప్రత్యేక హోదా సాధిద్దామని, ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలన్నదే తమ డిమాండ్ అని బొత్స స్పష్టం చేశారు. -
'ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి'
-
అందరికీ ‘సకల’ వేతనం ఇవ్వాలి
ౖయెటింక్లయిన్‌కాలనీ : ఎలాంటి కొర్రీలు పెట్టకుండా సకలజనుల సమ్మె వేతనాలు అత్యవసర సిబ్బందితో సహా అందరికీ ఇవ్వాలని హెచ్ఎంఎస్ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు నాచగోని దశరథంగౌడ్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆదివారం మాట్లాడారు. సకలజనుల సమ్మె వేతనాల్లో సకల కొర్రీలు పెట్టి ఇచ్చేందుకు యాజమాన్యం కుట్రపన్నుతోందని దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత గుర్తింపు యూనియన్‌పై ఉందన్నారు. తామే ఇప్పిచ్చామని పేర్కొంటున్న గుర్తింపు సంఘం నాయకులు కొర్రీలకు వారే బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికై గుర్తింపు సంఘం బాధ్యతాయుతంగా ముందుకు సాగి సకలజనుల సమ్మె వేతనాలు అందరికీ వర్తింపజేసేలా చూడాలని కోరారు. లేని పక్షంలో ప్రాతినిధ్య సంఘాలను కలుపుకుని ముందుకు వెళ్లి అందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఏదిఏమైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర వహించిన సింగరేణి కార్మికులకు సకలజనుల సమ్మెవేతనాలు చెల్లించడం సంతోషకరమన్నారు. కొంత ఆలస్యమైనా ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జమీల్, ప్రతాప్రావు, వీరస్వామి, సోమయాజులు తదితరులు పాల్గొన్నారు.