రేసింగ్‌తో రెచ్చిపోయిన విద్యార్థులు | bike racing in malakpet | Sakshi
Sakshi News home page

రేసింగ్‌తో రెచ్చిపోయిన విద్యార్థులు

Aug 26 2017 3:34 PM | Updated on Sep 12 2017 1:02 AM

మలక్‌పేట-దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై యువకులు బైక్‌ రేస్‌తో రెచ్చిపోయారు.

హైదరాబాద్: మలక్‌పేట-దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై యువకులు బైక్‌ రేస్‌తో రెచ్చిపోయారు. ఓ బుల్లెట్ వాహనం, మరో ద్విచక్రవాహనంపై కొందరు విద్యార్థులు ట్రిపుల్‌ రైడింగ్‌తో రేస్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో మరో ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొనడంతో ఆ వాహనంపై ఉన్న వ్యక్తి కిందపడి స్పృహ కోల్పోయాడు. విద్యార్థులు సంఘటన స్థలం నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న మలక్‌పేట పోలీసులు స్పృహ కోల్పోయిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించచారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement