చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
- టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం మే 9న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. పార్లమెంటు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నట్లు చెప్పారు. మంగళవారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద కృష్ణయ్య మాట్లాడారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 పార్టీల నేతలను కలసి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామన్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల సీఎంలు కేంద్రానికి అఖిలపక్షాన్ని పంపాలని డిమాండ్ చేశారు. ఏపీలో కాపులను బీసీ చేర్చాలనడం, గుజరాత్‌లో పటేళ్లను, హరియాణాలో జాట్లను ఇలా ప్రతీ చోట అగ్ర కులాలను చేర్చి బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు.