నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు
నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన ఓ ముఠా వీటిని నగరంలో చలామణి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ.3.85 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. కాగా.. పోలీసుల దాడి నుంచి ఇద్దరు వ్యక్తులు తప్పించుకుని పారిపోయారు. వీరు సుల్తాన్ బజార్ కేంద్రంగా నకిలీ నోట్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.