జైపాల్ రెడ్డి సంగతి దేశమంతా తెలుసు: బాల్క | balka suman fired on jaipal reddy | Sakshi
Sakshi News home page

జైపాల్ రెడ్డి సంగతి దేశమంతా తెలుసు: బాల్క

Jun 4 2016 2:32 AM | Updated on Aug 14 2018 10:59 AM

జైపాల్ రెడ్డి సంగతి దేశమంతా తెలుసు: బాల్క - Sakshi

జైపాల్ రెడ్డి సంగతి దేశమంతా తెలుసు: బాల్క

సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన దీక్షపై తప్పుడు వ్యాఖ్య లు చేయడం కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అవివేకానికి నిదర్శనమని ఎంపీ బాల్క సుమన్ అన్నారు.

సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన దీక్షపై తప్పుడు వ్యాఖ్య లు చేయడం కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అవివేకానికి నిదర్శనమని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ దీక్షకు హడలిపోయి నాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటన చేసిన విషయాన్ని అప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఉన్న జైపాల్‌రెడ్డి గుర్తు చేసుకుంటే మంచిదన్నారు.

శుక్రవారం ఆయన ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తో కలసి టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, దొంగ దీక్షలు, నాటకాలు, రాజీనామాలు కాంగ్రెస్ నేతలకే సాధ్యమన్నారు. అధికారమే పరమావధిగా పనిచేసిన జైపాల్‌రెడ్డికి తెలంగాణను మోసం చేసిన చరిత్ర ఉంద న్నారు. పదవుల కోసం  ఎన్ని పార్టీలు మార్చా రో దేశమంతా తెలుసన్నారు. తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆంధ్రాబాబు పెంపు డు కుక్కన్నారు. నోట్ల కట్టలతో ఆయన ఎలా దొరికిపోయాడో జనానికి తెలుసన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement