9న ఏపీ ఎన్జీరంగా వర్సిటీ స్నాతకోత్సవం | ap ng ranga university anniversery | Sakshi
Sakshi News home page

9న ఏపీ ఎన్జీరంగా వర్సిటీ స్నాతకోత్సవం

Aug 29 2015 2:10 AM | Updated on Jun 4 2019 6:39 PM

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 46వ స్నాతకోత్సవం గుంటూరు జిల్లా బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో వచ్చే నెల 9న జరుగుతుంది.

హైదరాబాద్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 46వ స్నాతకోత్సవం గుంటూరు జిల్లా బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో వచ్చే నెల 9న జరుగుతుంది. గవర్నర్ నరసింహన్ చాన్స్‌లర్ హోదాలో, నాబార్డ్ చైర్మన్ డాక్టర్ హర్షకుమార్ భన్వాలా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.రాష్ట్ర విభజన నేపథ్యంలో జరుగుతున్న తొలి స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి స్నాతకోత్సవంలో వ్యవసాయ రంగ ప్రముఖులు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుకు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలన్న వినతులను వర్సిటీ అధికారుల సమావేశం చర్చించింది. దీనిపై పాలక మండలి త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement