వచ్చే 2 నెలలు బాబు విదేశాల్లో బిజీబిజీ | AP CM Chandrababu foreign tour schedule confirmed | Sakshi
Sakshi News home page

వచ్చే 2 నెలలు బాబు విదేశాల్లో బిజీబిజీ

Oct 4 2016 7:23 PM | Updated on Oct 4 2018 6:57 PM

ఇప్పటికే పలు దేశాల్లో పలుసార్లు పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే రెండు నెలలు విదేశీ పర్యటనల్లో బిజీ బిజీగా గడపనున్నారు.

- వచ్చే నెల 13 నుంచి 20 వరకు అమెరికా పర్యటన
- డిసెంబర్ మధ్యలో దక్షిణ కొరియాలో పర్యటన


హైదరాబాద్ : ఇప్పటికే పలు దేశాల్లో పలుసార్లు పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే రెండు నెలలు విదేశీ పర్యటనల్లో బిజీ బిజీగా గడపనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడంలో భాగంగా విదేశాల్లో జరిగే సదస్సుల్లో పాల్గొనేందుకు ఆయా దేశాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నట్లు అధికార వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి.

వచ్చే నెల 13 నుంచి 20వ తేదీ వరకు అమెరికాలో సీఎం పర్యటించనున్నారు. అక్కడ జరిగే వివిధ పారిశ్రామిక సదస్సుల్లో చంద్రబాబు పాల్గొంటారని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. అలాగే డిసెంబర్ మధ్యలో దక్షిణ కొరియాలో సీఎం పర్యటించనున్నారు. ఇప్పటికే రాజధాని పేరుతో సింగపూర్‌లో అనేకసార్లు పర్యటించారు. జపాన్, చైనా దేశాల్లోనూ ముఖ్యమంత్రి పర్యటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement