నటి శ్రీలక్ష్మి కేసులో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన | actress sri lakshmi gold chain snatching case: CCTV footage shows sr nagar police | Sakshi
Sakshi News home page

నటి శ్రీలక్ష్మి కేసులో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన

Oct 3 2014 9:14 AM | Updated on Apr 3 2019 9:16 PM

నటి శ్రీలక్ష్మి కేసులో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన - Sakshi

నటి శ్రీలక్ష్మి కేసులో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన

సినీనటి శ్రీలక్ష్మి నగలను స్నాచింగ్ చేసిన నిందితులను పట్టుకునేందుకు ఎస్ఆర్ నగర్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

హైదరాబాద్ : సినీనటి శ్రీలక్ష్మి నగలను స్నాచింగ్ చేసిన నిందితులను పట్టుకునేందుకు ఎస్ఆర్ నగర్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం శ్రీలక్ష్మి యూసఫ్గూడలోని అయ్యంగార్ బేకరీకి వచ్చి వెళ్తుండగా దుండగలు ఆమె మెడలోని 8 తులాల బంగారు నగలను తెంచుకెళ్లిన విషయం తెలిసిందే. కారు వద్దకు ఆమె ఒంటరిగా వస్తున్నట్లు గమనించి దుండగులు స్నాచింగ్కు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

అయితే శ్రీలక్ష్మిని ఎక్కడి నుంచి వెంబడించారన్న దానిపై విచారణ జరుపుతున్నారు. శ్రీనగర్ కాలనీలోని శ్రీలక్ష్మి నివాసం నుంచి యూసుఫ్గూడలోని బేకరీ వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. గురువారం సాయంత్రం పోలీస్ స్టేషన్కు వచ్చిన శ్రీలక్ష్మికి ...ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని అందచేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement