రైల్లో పోకిరి వేషాలు: ముగ్గురి అరెస్ట్ | 3 arrested for misbehaving with passenger in train | Sakshi
Sakshi News home page

రైల్లో పోకిరి వేషాలు: ముగ్గురి అరెస్ట్

Mar 8 2016 6:31 PM | Updated on Sep 3 2017 7:16 PM

రైల్లో ప్రయాణీకుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తూ వెకిలి చేష్టలకు పాల్పడిన ముగ్గురు పోకిరీలను కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

కాచిగూడ (హైదరాబాద్) : రైల్లో ప్రయాణీకుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తూ వెకిలి చేష్టలకు పాల్పడిన ముగ్గురు పోకిరీలను కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రైల్వే సిఐ సి.లింగన్న తెలిపిన వివరాల ప్రకారం... ధర్మవరం నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైల్లో హర్యానా రాష్ట్రానికి చెందిన ముఖేష్‌ కుమార్ (23), పర్వీన్‌ కుమార్ (20), అనూష్ (21)ల పోకిరీ చేష్టలతో విసిగిపోయిన తోటి ప్రయాణీకులు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement