వినాయకుడి చేతిలోని 25 కేజీల లడ్డూ మాయం | 25 kg laddu theft from Ganesha hand | Sakshi
Sakshi News home page

వినాయకుడి చేతిలోని 25 కేజీల లడ్డూ మాయం

Sep 9 2016 10:31 PM | Updated on Sep 4 2017 12:49 PM

వినాయకుడి చేతిలోని 25 కేజీల లడ్డూ మాయం

వినాయకుడి చేతిలోని 25 కేజీల లడ్డూ మాయం

వినాయకుని చేతిలో లడ్డూ మాయమైన సంఘటన శుక్రవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

హైదరాబాద్:  దేవుడి మండపంలో దొంగలు పడ్డారు. అన్నీ వదిలేసి ఏకంగా గణపతి చేతిలోని 25 కేజీల లడ్డూను ఎత్తుకెళ్లారు! హైదరాబాద్ లోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుందీ ఘటన. పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..

ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాసనగర్ కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని ఏర్పాటుచేశారు. వినాయకుడి చేతిలో 25 కేజీల భారీ లడ్డూను ఉంచారు. బుధవారం రాత్రి ఆ లడ్డూ మాయమైంది. టిఫిన్ సెంటర్ నిర్వాహకుడైన రాకేశ్ ఈ విషయాన్ని మండపం వద్ద కాపలా ఉండే వ్యక్తికి చెప్పాడు. కాగా, దొంగతనం జరిగిన రోజు రాత్రి 2:30 గంటల సమయంలో రాకేశ్ మండపం దగ్గర్లో తచ్చాడాడని మరో యువకుడు చెప్పడంతో నిర్వాహకులు రాకేశ్ ను నిలదీశారు.

విషయం పోలీసుల దాకా వెళ్లింది. కుషాయిగూడ పోలీసులు అనుమానితుడు రాకేశ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. రాకేశ్ ను పోలీసులు పట్టుకుపోయారన్న విషయం తెలుసుకున్న కాలనీ వాసులు స్టేషన్ వద్దకు చేరుకుని.. రాకేశ్ అలాంటివాడు కాదని, కష్టపడి పనిచేసుకునే రకమని చెప్పారు. కాలనీ వాసులు ఎంత చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం రాకేశ్ ను వదలిలిపెట్టలేదు. విచారణ పూర్తయిన తర్వాతే పంపిస్తామని చెప్పారు. లడ్డూ దొంగ ఎవరనేది తెలియాల్సిఉంది.

Advertisement
 
Advertisement
Advertisement