ఎన్‌ఎఫ్‌సీలో ఉద్యోగాల పేరిట మోసం | 2 arrested over cheating for fake jobs in NFC | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎఫ్‌సీలో ఉద్యోగాల పేరిట మోసం

May 25 2016 9:40 AM | Updated on Sep 4 2018 5:21 PM

అణు ఇంధన సంస్థ(ఎన్‌ఎఫ్‌సీ)లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురిని మోసం చేసిన కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: అణు ఇంధన సంస్థ(ఎన్‌ఎఫ్‌సీ)లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురిని మోసం చేసిన కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కుషాయిగూడకు చెందిన నూకరాజు మురళి, మమతకలసి ఎన్ ఎఫ్‌సీ అధికారి గోవర్దన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఉద్యోగార్థులకు కాల్‌ లెటర్లు జారీ చేశారు. అయితే, అవి నకిలీవని తేలటంతో బాధితులు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు మురళి, మమతలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement