టెట్‌కు 1.28 లక్షల దరఖాస్తులు | 1028 lakhs of applications for TET exam | Sakshi
Sakshi News home page

టెట్‌కు 1.28 లక్షల దరఖాస్తులు

Mar 25 2016 1:58 AM | Updated on Aug 20 2018 3:21 PM

రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసేందుకు ఇప్పటివరకు 1.28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఈ నెల 31 వరకు దరఖాస్తుకు గడువు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసేందుకు ఇప్పటివరకు 1.28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 15 నుంచి ఫీజు చెల్లింపు, 16వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ పది రోజుల్లోనే 1,28,464 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఫీజు చెల్లించగా, గురువారం నాటికి 1,17,735 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించారు.

మరోవైపు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 31వ తేదీ వరకు ఉంది. ఈ వారం రోజుల్లో మరో 1.50 లక్షలకు పైగా దర ఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈసారి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) చివరి సంవత్సరం చదివే విద్యార్థులకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement