కళాశాల బస్సును ఢీకొట్టిన మెట్రో క్రేన్ | 10 students injured in road accident | Sakshi
Sakshi News home page

కళాశాల బస్సును ఢీకొట్టిన మెట్రో క్రేన్

Mar 20 2016 9:00 AM | Updated on Nov 9 2018 4:44 PM

కళాశాల బస్సును ఢీకొట్టిన మెట్రో క్రేన్ - Sakshi

కళాశాల బస్సును ఢీకొట్టిన మెట్రో క్రేన్

నగరంలో మెట్రో పనుల్లో ఉపయోగిస్తున్న క్రేన్ కళాశాల బస్సును ఢీకొట్టిన ఘటనలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.

హైదరాబాద్ : నగరంలో మెట్రో పనుల్లో ఉపయోగిస్తున్న క్రేన్ కళాశాల బస్సును ఢీకొట్టిన ఘటనలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన నాంపల్లి రవీంద్రభారతి చౌరస్తా వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

ఇబ్రహీంపట్నం సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నెక్లెస్‌రోడ్‌పై 5కే రన్ ఏర్పాటు చేశారు. రన్లో పాల్గొనడానికి బస్సులో వెళ్తుండగా.. రవీంద్ర భారతి సమీపంలో మెట్రో రైలు పనులు నిర్వహిస్తున్న క్రేన్ ప్రమాదవశాత్తు బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement