ప్రియుడి ఇంటి ముందు ప్రేయసి ధర్నా | Woman stages dharna infront of lover's house | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటి ముందు ప్రేయసి ధర్నా

Jan 8 2016 2:44 PM | Updated on Sep 3 2017 3:19 PM

ప్రియుడి ఇంటి ముందు ప్రేయసి ధర్నా

ప్రియుడి ఇంటి ముందు ప్రేయసి ధర్నా

రెండేళ్లు ప్రేమాయణం సాగించిన ఓ యువకుడు పెళ్లి ఊసెత్తేసరికి ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోవాలంటే రూ.5 లక్షలు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు.

కురవి (వరంగల్): రెండేళ్లు ప్రేమాయణం సాగించిన ఓ యువకుడు పెళ్లి ఊసెత్తేసరికి ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోవాలంటే రూ.5 లక్షలు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా కురవి మండలం కోలంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

మండలంలోని కొలంపల్లి గ్రామానికి చెందిన రాజేందర్(22) డిగ్రీ చదువుతున్న సమయంలో పక్క గ్రామానికి చెందిన మాలోతు భద్ర(21)ను ప్రేమించాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న భద్ర కూడా రాజేందర్‌ను ఇష్టపడింది. ఈ క్రమంలో రెండు సంవత్సరాలు హాయిగా గడిచిన వీరి ప్రేమబంధం పెళ్లి ప్రస్తావన వచ్చే సరికి బీటలు వారింది. చదువు పూర్తి కావడంతో పెళ్లి చేసుకోమని యువతి ఒత్తిడి తీసుకురాగా యువకుడు ముఖం చాటేసి తిరుగుతున్నాడు.

దీంతో ఆగ్రహించిన యువతి నెల రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించింది. కుల పెద్దల సమక్షంలో పంచాయతీ  నిర్వహించుకుంటామని చెప్పిన యువకుడి తరఫు బంధువులు యువతి కుటుంబసభ్యులను రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. దీనికి నిరాకరించిన యువతి యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమెకు మహిళ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement