ఖమ్మం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంది.
పినపాక : ఖమ్మం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన అశ్విని (22) సోమవారం ఉదయం పురుగుల మందు సేవించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి అశ్విని సాయంత్రం మృతి చెందింది. ఆమె రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. ప్రేమ విఫలం కావడమే ఘటనకు కారణంగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.