నీరు + ఉప్పు = వెలుగు! | Water + salt = light | Sakshi
Sakshi News home page

నీరు + ఉప్పు = వెలుగు!

Jul 26 2015 2:27 PM | Updated on Sep 3 2017 6:09 AM

నీరు + ఉప్పు = వెలుగు!

నీరు + ఉప్పు = వెలుగు!

గ్లాసుడు నీళ్లు, రెండు చెమ్చాల ఉప్పు... ఫొటోలో కనిపిస్తున్న లాంతరు ఏకబిగిన ఎనిమిది గంటల పాటు వెలుగులు ఇచ్చేందుకు కావాల్సినవి ఇవి మాత్రమే!

గ్లాసుడు నీళ్లు, రెండు చెమ్చాల ఉప్పు... ఫొటోలో కనిపిస్తున్న లాంతరు ఏకబిగిన ఎనిమిది గంటల పాటు వెలుగులు ఇచ్చేందుకు కావాల్సినవి ఇవి మాత్రమే! కరెంటు లేకపోయినా, బ్యాటరీల చార్జింగ్ అయిపోయినా ఫర్వాలేదు. ఈ ‘సాల్ట్’ బల్బ్ ఎక్కడైనా సరే వెలుగులు పంచుతుంది. ఫిలిప్పీన్స్ లోని సస్టెయినబుల్ ఆల్టర్నేటివ్ లైటింగ్ క్లుప్తంగా ‘సాల్ట్’ అభివృద్ధి చేసిన ఈ లాంతరు వెలుగులతోపాటు అవసరమైనప్పుడు సెల్‌ఫోన్ బ్యాటరీలను చార్జ్ చేస్తుంది కూడా!

దాదాపు ఏడువేల ద్వీపాలతో కూడిన ఫిలిప్పీన్స్‌లో 1.6 కోట్ల మందికి విద్యుత్ సౌకర్యం లేదట. ఈ సమస్యను ‘సాల్ట్’ తెలివిగా పరిష్కరిస్తుంది. ఎల్‌ఈడీ బల్బులతో కూడిన ఈ లాంతరు నిజానికి ఒక రకమైన బ్యాటరీ. ఉప్పునీటిని ఎలక్ట్రోలైట్‌గా వాడుకుంటూ కొంచెం తక్కువ స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఎల్‌ఈడీ బల్బులు వెలుగుతాయి. భలే ఐడియా కదూ!

Advertisement
 
Advertisement
Advertisement