నివాస ప్రాంతంలో కూలిన విమానం | Three die in Tokyo plane crash | Sakshi
Sakshi News home page

నివాస ప్రాంతంలో కూలిన విమానం

Jul 27 2015 1:56 AM | Updated on Sep 3 2017 6:13 AM

నివాస ప్రాంతంలో కూలిన విమానం

నివాస ప్రాంతంలో కూలిన విమానం

జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని నివాస ప్రాంతంలో ఆదివారం ఓ చిన్న విమానం కుప్పకూలింది.

ముగ్గురు దుర్మరణం.. జపాన్‌లో ఘటన
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని నివాస ప్రాంతంలో ఆదివారం ఓ చిన్న విమానం కుప్పకూలింది. ముగ్గురు దుర్మరణం చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. పైలట్ సహా నలుగురు ప్రయాణిస్తున్న విమానం ‘చోఫు’ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొద్ది సమయానికే కుప్పకూలింది. నలుగురి ప్రయాణికుల్లో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. విమానంలోని ఇద్దరు వ్యక్తులు, స్థానిక మహిళ ఒకరు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

‘నివాస గృహాల సమీపంలో విమానం కూలి పెద్ద ట్రక్కుపై పడింది. తర్వాత చూసే సరికి పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. మూడు ఇళ్లు, రెండు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement